పల్లవి
నమో విఘ్నరాజ నమో నమో విఘ్నరాజ
నమో దివ్య తేజ నమో నమో దివ్య తేజ
చరణం
కుడుములు ఉండ్రాళ్ళు జంబూ ఫలములు అర్పించినాము
ఇడుములు బాపు దేవ ఇంపుగా భుజింపుము
"నమో"
సిద్ది బుద్ది వినాయక సకల సుఖదాయక
కొద్దిగా నీ కృప యున్న కొదువయేమి మాకిక
" నమో"
మంద బుద్ది పారద్రోలు మహా వీర గణపతి
ముందుగా నిను పూజించి పొందుదుము సద్గతి
" నమో"
సత్సంగ సుపూజిత సుజ్ఞాన విరాజిత
వాత్సల్య ప్రపూరిత మాత్సర్యనివారిత
" నమో"
దామోదర వందిత దాక్ష్యయణి ప్రియసుత
దశకంఠని గర్వహత దాసకోటి సదాహిత
"నమో"
శ్రీ గణేశ పాహిమాం జై గణేశ రక్షమాం
శ్రీ గణేశ పాహిమాం జై గణేశ రక్షమాం
No comments:
Post a Comment